HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >What Is Lab Grown Meat Which Is Ready For Sale In The Us

Lab Grown Meat : ల్యాబ్ లో చికెన్ తయారీ.. అమెరికాలో సేల్స్ షురూ

Lab Grown Meat : జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. జంతువధ చేయకుండానే ఇక మాంసం లభిస్తుంది..

  • Author : Pasha Date : 24-06-2023 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lab Grown Meat
Lab Grown Meat

Lab Grown Meat : జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్..

జంతువధ చేయకుండానే ఇక మాంసం లభిస్తుంది..

ల్యాబ్‌లో తయారు చేసే కోడి మాంసం సేల్స్ దిశగా ఒక అడుగు ముందుకు పడింది. ల్యాబ్ తయారీ కోడి మాంసాన్ని మార్కెట్లో విక్రయించేందుకు అమెరికా వ్యవసాయ శాఖ 2 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాబ్ లో తయారయ్యే చికెన్ ను సేల్ చేసుకునేందుకు కాలిఫోర్నియాకు చెందిన అప్‌సైడ్ ఫుడ్స్ , ఈట్ జస్ట్ కంపెనీలకు పర్మిషన్ లభించింది. అమెరికాలోని ఎంపిక చేసిన కొన్ని రెస్టారెంట్లలో ఈ ల్యాబ్‌ చికెన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీలు తెలిపాయి. ఈ మాంసం వినియోగానికి సురక్షితమే అని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ డిసైడ్ చేసింది. దీంతో ప్రపంచంలో ఇప్పటివరకు ల్యాబ్ తయారీ కోడి మాంసాన్ని(Lab Grown Meat) ఆమోదించిన రెండో దేశంగా అమెరికా నిలిచింది. ఈ నిర్ణయం తీసుకున్న మొదటి దేశం సింగపూర్.

Lab Grown Meat1

ల్యాబ్‌ లో మాంసం తయారీ ఇలా..  

ఇంతకీ జంతువుల మాంసానికి, ల్యాబ్‌లో తయారు చేస్తున్న కొత్త రకం మాంసానికి తేడా ఏమిటి ? అనే దానిపై ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. దానిపై ఒక లుక్ వేద్దాం. ఉదాహరణకు కోడి మాంసాన్ని ల్యాబ్ లో తయారు చేయాలని భావిస్తే .. బతికి ఉన్న ఒక కోడికి మత్తుమందు ఇచ్చి దాని శరీరం నుంచి కొన్ని సజీవ శరీర కణాలను సేకరిస్తారు. ఈ కణాలను అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, షుగర్, మినరల్స్, విటమిన్లతో కూడిన మిశ్రమం నింపిన ఒక ట్యాంకులో నిల్వ చేస్తారు. ఈ మిశ్రమంలో కలిసిపోయి కోడి కణాలు కృత్రిమంగా పెరగడానికి అవసరమైన ఉష్ణోగ్రతను శాస్త్రవేత్తలు క్రియేట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ట్యాంకులోని కోడి కణాలు మాంసం యొక్క పెద్ద షీట్లుగా పెరుగుతాయి. దాదాపు 3 వారాల తర్వాత అవి మాంసం ముక్కల్లా తయారవుతాయి. చూడటానికి రియల్ మాంసమే అనిపిస్తుంది. లుక్ , టేస్ట్ ..  సేమ్ టు సేమ్ ఒరిజినల్ చికెన్ లానే ఉంటుంది. అయితే సాధారణ కోడి మాంసం కంటే కొద్దిగా పాలిపోయిన కలర్ ఉంటుంది.

రేటు ఎంత ? ప్రపంచమంతా ఎప్పుడు?

మార్కెట్‌లో ఈవిధమైన ల్యాబ్ చికెన్ విరివిగా లభించడానికి ఇంకో పదేళ్లు టైం పట్టొచ్చు. ల్యాబ్ లో తయారైన చికెన్ ధర.. సాధారణ చికెన్ ధర కంటే కాస్ట్లీ. భవిష్యత్తులో ఉత్పత్తి టెక్నాలజీ అప్ డేట్ అయితే రేట్లు తగ్గొచ్చు. అయితే ఇలాంటి మాంసాన్ని వివిధ మతాలు ఏ కోణంలో చూస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • Lab Grown Meat
  • ready for sale
  • us
  • USDA approval
  • what is

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd