Post Pregnancy: డెలివరీ తర్వాత బరువు పెరిగిరా..?ఇలా తగ్గించుకోండి..!!
డెలివరీ తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందున్న ఉన్న బరువు లేదా ఆరోగ్యకరమైన బరువుకు అంత సులభం కాదు.
- By Hashtag U Published Date - 08:04 AM, Wed - 23 February 22

డెలివరీ తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందున్న ఉన్న బరువు లేదా ఆరోగ్యకరమైన బరువుకు అంత సులభం కాదు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్త్రీలు దాదాపు సగం మంది…బరువు పెరుగుతారు. బరువు పెరిగితేనే మంచిది.అయితే డెలిరీ తర్వాత మీ ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గించుకోవచ్చు. అదేలాగో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్రాష్ డైట్ కు దూరంగా:
క్రాష్ డైట్ అంటే చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం అని అర్థం. ఈ డైట్ తీసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గేలా చేస్తుంది. డెలివరీ తర్వాత మీ శరీరం రికవర్ అయ్యేందుకు మంచి పోషకాహారం అవసరం అవుతుంది. అలాగే…మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే..సాధారణం కంటే ఎక్కువగా కేలరీలు అవసరం అవుతాయి. తక్కువ కేలరీల ఆహారంలో ముఖ్యమైన పోషకాలనేవి ఉండవు. అలా తీసుకుంటే మీరు తొందరగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది.
ఫైబర్ ఫుడ్:
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే…బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. నెమ్మదిగా జీర్ణం అయ్యే ఫైబర్ ఫుడ్స్ ఆలస్యంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో ఆకలి హార్మోన్స్ లెవెల్స్ తగ్గుతాయి. అందుకే మీరు ఎక్కువసేపు యాక్టివ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా కేలరీల ఇన్టేక్ ను తగ్గించడంలోనూ సహాయపడతాయి.
ప్రోటీన్స్ :
మీ ఆహారంలో ప్రోటీన్స్ చేర్చినట్లయితే మెటబాలిజంను పెంచుతుంది. ఆకలిని తగ్గించేస్తుంది. ఇంకా ఎక్కువ కేలరీలను తీసుకోవడం తగ్గుతుంది. ఇతర రకాల ఆహారం కంటే శరీరంలో డైజెస్ట్ కావడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. అందుకే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతుంటాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. లీన్ మీట్, గుడ్లు, మెర్య్కూరీ ఉన్న చేపలు, లెగ్యూమ్స్, నట్స్ ఇంకా సీడ్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ అందించే ఆహార పదార్థాలు.
హెల్దీ స్నాక్స్ :
మీరు మీల్స్ చేసిన తర్వాత మధ్యలో మళ్లీ ఆకలిగా అనిపించినట్లయితే హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. వీటిలో సలాడ్స్, మిక్స్డ్ నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్, పెరుగు ఇంకా ఇంట్లో తయారు చేసిన గ్రానోలా వంటికి ఆరోగ్యకరమైన స్నాక్స్ గా తీసుకోవచ్చు.
షుగర్, రిపైన్డ్ కార్బస్:
ఈ పదార్థాల్లో ఎక్కువ కెలరీలు ఉంటాయి. న్యూట్రిఎంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీటిని మీరు వెయిల్ లాస్ డైట్ లో బహిష్కరించాలి. షుగర్, డ్రింక్స్, మైదా, పేస్ట్రీస్, కేక్స్, బిస్కెట్స్ లాంటి వాటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అవాయిడ్ చేయాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్ :
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో చక్కెర, అన్ హెల్తీ ఫ్యాట్స్, ఉప్పు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఇవన్నీ మీ బరువు తగ్గించే ప్రయత్నాలను అడ్డుకుంటుంటాయి. ఫాస్ట్ ఫుడ్స్, ముందుగా ప్యాక్ చేసిన ఆహారాలు, చిప్స్, కుకీలు ఇంకా స్వీట్స్ వీటన్నింటిని ప్రాసెస్డ్ ఫుడ్ అని పిలుస్తారు. అయితే వీటిని తినడం మానుకోవాలి.
ఎక్సర్‌సైజ్ :
జాగింగ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇంకా ఇంటర్వెల్ ట్రైనింగ్ లాంటి కార్డియో ….కేలరీలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎక్సర్ సైజింగ్ గుండెకు మంచిది. డయాబెటిస్ ను నివారిస్తుంది. అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్సర్ సైజింగ్ మాత్రమే చేస్తే…బరువు తగ్గరు…దాంతోపాటుగా పోషకాహారం కూడా తీసుకోవాలి. ఏరోబిక్ ఎక్సర్ సైజ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఇక డెలివరీ తర్వాత పెల్విక్ తోపాటు స్టమక్ ఏరియాలో హీల్ కావడానికి సమయం పడుతుంది. ప్రత్యేకించి సిజేరియన్ డెలివరీ అయితే…ఎప్పుడు ఎక్సర్ సైజ్ చేయడం సురక్షితమో తెలుసుకుని అప్పుడు మొదలు పెట్టండి. ఇక మీరు ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఫిట్ గా ఉంటే…డెలివరీ తర్వాత సాధారణంగా ఎలా అనిపిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక వైద్యుల సలహా మేరకు ఫాస్ట్ వాకింగ్ లాంటి కనీసం 150 నిమిషాల మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్ సైజ్ చేస్తే మంచిది.