CPI Party: లష్కర్ ను భ్రష్టు పట్టించిన పద్మారావును ఓడిస్తాం: కాంపల్లి శ్రీనివాస్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు ను ఓడిస్తామని సీపీఐ నాయకులు తేల్చి చెప్పారు.
- Author : Balu J
Date : 17-10-2023 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
CPI Party: లష్కర్ ను భ్రష్టు పట్టించిన పద్మారావుకు ఓటు హక్కు అడిగే నైతికత లేదని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని సమస్యలకు అడ్డాగా మార్చిన BRS పార్టీనీ త్వరలో జరగబోయే ఎన్నికలలో ఓడిస్తామని CPI సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ కోరారు. CPI ఆధ్వర్యంలో తుకారం గేటు వద్ద నిర్వహించిన ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పదేళ్లలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని పదేళ్ల క్రితం ఉన్న సమస్యలే నేటికీ ఉన్నాయని అన్నారు.
నియోజకవర్గంలో ఎటు చూసినా తోవ్విపడేసిన రోడ్లు, ఏరులై పారుతున్న డ్రైనేజీ, కలుషిత జలాలు, ఇరుకైన రోడ్లతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ పదేళ్లలో ఎమ్మెల్యే ఆస్తులు కూడబెట్టుకున్నారే తప్ప నియోజకవర్గ ముఖచిత్రంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదని ఎద్దేవ చేశారు. అడ్డగుట్టలో నేటికి కనీసం మంచినీటి సమస్యను తీర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ఓటమి లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా సమిష్టిగా పనిచేయాలని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో CPI సికింద్రాబాద్ సహాయ కార్యదర్శిలు MD ఉమర్ఖాన్, కొమరెల్లిబాబు వివిధ డివిజన్ కార్యదర్శలు, పాకాలయాదగిరి, తోకల సోమయ్య,షేక్ లతిఫ్, రషీద్, గౌరీనాగరాజ్, మల్లేష్, రంజిత్ సింగ్, ఖాజ మియా, శ్రీహరి,ఆంజనేయులు, లక్ష్మణ్,ఖాసిం,అంజి,రామస్వామి బాలరాజ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.