BRS Minister: కొడంగల్ లో ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: మంత్రి మహేందర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకులు కొడంగల్ ప్రజలను, ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెడితే చర్యలు తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.
- By Balu J Published Date - 04:34 PM, Fri - 27 October 23

BRS Minister: కాంగ్రెస్ నాయకులు కొడంగల్ ప్రజలను, ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెడితే… భయభ్రాంతులకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బుతో కొనాలని వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మరని, ఓటమి భయంతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, అభివృద్ధి కావాలా, డబ్బు కావాలా అని ఆయన ప్రజలనుద్దేశించి అన్నారు. ‘‘వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే సీఎం గా కేసీఆర్, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మారోమారు గెలుపు తథ్యం. కొడంగల్లో ఎప్పుడూ లేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గత తొమ్మిదేళ్లలో నిర్వహించాం.
మేనిఫెస్టోలో ఉన్న రైతుబంధు, ప్రతి కుటుంబానికి బీమా సదుపాయం లాంటివి దేశంలో ఎక్కడ లేవు. న్యాయంగా ఎన్నికలలో పోటీచేసి గెలవాలి తప్ప ప్రజలకు ప్రలోభ పెట్టరాదు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను నట్టేట ముంచినారు అని తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ను ప్రజలు నమ్మరు’’ అని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.