Bridal Glow: ఆలియా వలె మెరిసిపోవాలా..?ఈ ఫేస్ మాస్క్ లు ట్రై చేయండి.!!
ఈ మధ్యకాలంలో వివాహాల్లో వధూవరులిద్దరూ తమ పెళ్లి దుస్తుల్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం సాధారణం అయ్యింది.
- By Hashtag U Published Date - 06:00 AM, Sat - 16 April 22
ఈ మధ్యకాలంలో వివాహాల్లో వధూవరులిద్దరూ తమ పెళ్లి దుస్తుల్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం సాధారణం అయ్యింది. రణబీర్, ఆలియా జంట కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట సబ్యసాయి ముఖర్జీ రూపొందించిన పెళ్లి దుస్తుల్లో దగదగా మెరిసిపోయారు. ఆలియా ఐవరీ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ ఆర్గంజా చీరలో తళుక్కుమంది. ఆమె డ్రెస్సుకు తగ్గట్లు మేకప్ మరింత అందంగా కనిపించేలా చేసింది. దుస్తువులకు తగ్గట్లుగా భారీ ఆభరణాలు మరింత ఆకట్టుకన్నాయి. పెదవులపై సొగసైన స్ట్రోక్ తో కూడిన మినిమల్ మేకప్ ఆలియా అందాన్ని రెట్టింపు చేసింది.
మీరు ఆలియా భట్ లాగా బ్రైడల్ గ్లో పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ ఐదు హోం మేడ్ ఫేస్ మాస్క్ లను ట్రై చేసి చూడండి.
1. పసుపు, బెసిన్, పెరుగు ఫేస్ మాస్క్:
పసుపులో ఎన్నో యాంటీ బయాటిక్స్ ఉంటాయి. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక బౌల్లో బెసిన్, పసుపు, పెరుగు వేసి…ఈ మూడింటిని కలపాలి. ముఖానికి శుభ్రంగా కడిగిన తర్వాత..ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత సర్కిల్ షేప్ లో మసాజ్ చేయాలి. దాదాపు ముఖంపై 8 నిమిషాలపాటు అలాటే ఉంచాలి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
మీది పొడి చర్మం అయినట్లయితే…పెరుగు కాకుండా మలై వాడటం మంచిది.
2. ముల్తానీ మిట్టి..రోజ్ వాటర్:
ముల్తానీ మిట్టి ప్యాక్ వాడినట్లయితే ముఖంలో గ్లో వస్తుంది. పురాతన కాలం నుంచి ఈ ముల్తానీ మట్టిని భారతీయులు వాడుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి…ఒక గిన్నెలో వేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ పోయాలి. బాగా కలిపిన తర్వాత..మీ ముఖంపై అప్లై చేయండి. సుమారు 10 నిమిషాలపాటు అలాగే ఉంచండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ ఫేస్ మాస్క్ ప్రకాశవంతమైన మోము ఛాయను అందించడమే కాదు..మీ చర్మాన్ని టోన్ చేస్తుంది. మీ ముఖాన్ని చల్లగా ఉంచుతుంది.
3. ఆరెంజ్ పౌడర్ , పాలు:
మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ మాస్క్ ప్రయత్నించి చూడండి. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ తొక్కలను కొన్నిరోజులపాటు ఎండలో ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి. అందులో కొన్ని పాల చుక్కలు వేసి బాగా కలపాలి. ఇఫ్పుడీ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా తరచుగా చేసినట్లయితే మీ ముఖం కాంతివంతగా మెరిసిపోతుంది.
4. దోసకాయ, తేనె:
వేసవికాలంలో దోసకాయ, తేనె ఫేస్ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. ఈ వేసవిలో మీ చర్మానికి కావాల్సిన కూలింగ్ ను ఇస్తుంది. దోసకాయ తురుముతో కొద్దిగా తేనె కలపాలి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి…పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ మీ చర్మాన్ని పునురుజ్జీవింపజేస్తుంది. అంతేకాదు మాయిశ్చరైజ్ లా పనిచేస్తంది. అచ్చం అలియా భట్ లా మెరిసిసోతారు.
5. మసూర్ దాల్, పాలు, పసుపు :
ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలంటే…ఒక టేబుల్ స్పూన్ మసూర్ పప్పును రోజ్ వాటర్ లో రాత్రంతా నానబెట్టాలి. దీన్ని బ్లెడర్ లో వేసి పాలు, చిటికెడ్ పసుపు వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై మెడ ప్రాంతంలో అప్లై చేయాలి. సుమారు పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
మసూర్ పప్పు ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది. పసుపు ముఖంలో మెరుపు తెస్తుంది. పాలు మీ చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తాయి. ఈ ఫేస్ మాస్క్ రెగ్యూలర్ గా వాడినట్లయితే మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
Related News
NTR : హృతిక్, రణ్బీర్తో ఎన్టీఆర్ పార్టీలు.. వీడియో వైరల్..
హృతిక్, రణ్బీర్తో కలిసి ఎన్టీఆర్ బాలీవుడ్ లో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు. తారక్ తో పాటు ఆయన సతీమణి..