HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vivo V25 Pro Specifications Here

VIVO V25 PRO: వివో వీ 25 ప్రో ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్లు.!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన

  • Author : Anshu Date : 04-08-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivo V25 Pro
Vivo V25 Pro

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివో సంస్థ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మధ్య శ్రేణి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఆండ్రాయిడ్ ఫోన్ వివో 25 ప్రో. అయితే ఈ వివో 25 ప్రో స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రత్యేకతలు తాజాగా లీక్ అయ్యాయి.

ఆగస్టు 17వ తేదీన దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా ఈలోపు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్, ఐఎంఈఐ నెంబరింగ్ కోసం అప్లై చేసిన వివరాల ఆధారంగా వివో వి 25, వివో వి25 ప్రో ఫోన్లకు సంబంధించిన ప్రత్యేకతలను తాజాగా ప్రఖ్యాత మొబైల్ టెక్ వెబ్సైట్లు బహిర్గతం చేశాయి. అయితే ఈ మొబైల్ ఆగస్టు 25వ తేదీ నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. మరి ఈ మొబైల్ ప్రత్యేకతలు ఏంటి అన్న విషయానికి వస్తే.. వివో వీ 25 ప్రో ఫోన్ లో మీడియా టెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్, మాలి జీ77 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటాయి. అలాగే 8 జీబీ నుంచి 12 జీబీ వరకు ర్యామ్ తో మోడళ్లు అందుబాటులో ఉంటాయి.

వివో వీ25 సాధారణ మోడల్ లో మీడియా టెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్, మాలి జీ68 ప్రాసెసర్ ఉంటాయని టెక్ వెబ్ సైట్లు పేర్కొన్నాయి. ఈ వివో 25 ప్రో ఆరున్నర అంగుళాల పరిమాణంలో ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో ఉంటుంది. డిస్ ప్లే పై భాగంలో మధ్యన పంచ్ హోల్ విధానంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని టెక్ వెబ్ సైట్లు తెలిపాయి. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని పేర్కొన్నాయి. కాగా ఈ ఫోన్ ధర ఎంత వరకు ఉండవచ్చు అన్న విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Offbeat
  • Smart Phone
  • vivo
  • Vivo v25 pro
  • Vivo v25 pro specifications

Related News

    Latest News

    • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd