Viral Video: వామ్మో.. చేతిపంపు నుంచి నీళ్లు, మంటలు.. మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన!
మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలో, ప్రకృతిలో ఎన్నో రకాల వింతలు,అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా
- By Anshu Published Date - 08:16 AM, Fri - 26 August 22

మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలో, ప్రకృతిలో ఎన్నో రకాల వింతలు,అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా ప్రకృతిలో జరిగే వింతలు,అద్భుతాలు చూసి ఒక్కసారి ఆశ్చర్యపోగా మరికొన్నిసార్లు భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అలా ప్రకృతిలో ఉన్నపలంగా పరిస్థితులు ఒకేసారిగా తారు మారవుతూ ఉంటారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లోని బుక్సువా బ్లాక్, కచ్చర్ గ్రామం లో కూడా అలాంటి వింతైన ఘటన ఒకటి చోటు చేసుకుంది.
చేతిపంపు లేదా బోరింగ్ లో నుంచి ఒక్కసారిగా మంటలు ఆ తరువాత వెంటనే నీళ్లు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు పెట్టారు. అలా చాలా సేపు కొనసాగడంతో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఘటనతో అక్కడి స్థానికులు ఉలిక్కి పడ్డారు. తమ కళ్లను అస్సలు నమ్మలేక పోతున్నామని కొందరు అంటుండగా, ఇంకొందరు కెమికల్ లీక్ వల్లే ఇలా జరిగిందని జరిగి ఉండవచ్చని అంటున్నారు.
Hand pump spewing fire and water in Kachhar village, Buxwaha,Villagers have informed the concerned officials.Local administration is sending a team to spot#madhyapradesh pic.twitter.com/8M4c7HfRQN
— Siraj Noorani (@sirajnoorani) August 25, 2022
ఈనేపథ్యంలో స్థానిక నేతలు కొందరు చత్తర్‌పూర్ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు భూమి లోపలి పొరల్లోంచి మీథేన్ వాయువు వెలువడటంతో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు.