Vallabaneni Vamshi : వల్లభనేని వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్
Vallabaneni Vamshi : ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేయగా, విజయవాడ సీఐడీ కోర్టు వర్చువల్ విచారణ నిర్వహించి రిమాండ్ విధించే నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 04:08 PM, Mon - 3 March 25

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi)కి సీఐడీ కోర్టు (CID Court) ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేయగా, విజయవాడ సీఐడీ కోర్టు వర్చువల్ విచారణ నిర్వహించి రిమాండ్ విధించే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు, కేసులు నమోదై ఉండటంతో, రాజకీయంగా కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Iron Rod Vs Infant: 30 రోజుల పసికందుకు ఇనుప చువ్వలతో 40 వాతలు.. ఏమైంది ?
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో వల్లభనేని వంశీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో వంశీకి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో, ఈ కేసులో A71గా ఆయనను చేర్చి, కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీని వర్చువల్‌గా విచారించి, ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదై ఉంది. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులోనూ సీరియస్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, వంశీపై కోర్టు కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.