Israel Vs Gaza : గాజా మరణాల సంఖ్య నమ్మేలా లేదు : బైడెన్
Israel Vs Gaza Updates : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్య చేశారు.
- By Pasha Published Date - 06:39 AM, Thu - 26 October 23

Israel Vs Gaza : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్య చేశారు. ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై చేస్తున్న వైమానిక దాడుల్లో చనిపోతున్న వారి సంఖ్య నమ్మేలా లేదని ఆయన కామెంట్ చేశారు. గాజా ప్రజల మరణాల సంఖ్యకు సంబంధించి గాజా ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న ప్రకటనలపై తనకు డౌట్ ఉందని బైడెన్ పేర్కొన్నారు. తాజాగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “పాలస్తీనియన్లు ఎంతమంది చనిపోయారనే దాని గురించి నిజం చెబుతున్నారని నేను భావించడం లేదు. ఈ యుద్ధంలో చనిపోతున్నది అమాయకులే అని నేను అనుకుంటున్నాను. యుద్ధం చేస్తున్నందుకు చెల్లిస్తున్న మూల్యం ఇది’’ బైడెన్ చెప్పారు. కాగా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజాలోని అల్ జజీరా అరబిక్ బ్యూరో చీఫ్ వేల్ దహదౌహ్ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు(Israel Vs Gaza) చనిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో లేటెస్ట్ మరణాల గణాంకాలు
గాజా(పాలస్తీనా)
మరణాల సంఖ్య- 5,791
గాయపడినవారు- 16,297
వెస్ట్ బ్యాంక్ (పాలస్తీనా)
మరణాల సంఖ్య-103
గాయపడినవారు- 1,828