Canada Wildfires: కెనడా అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం
కెనడా అడవుల్లో అగ్ని ప్రమాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ భీకర అగ్నిప్రమాదం ప్రభావం అమెరికా దాకా వ్యాపిస్తుంది. బుధవారం యుఎస్ ఈస్ట్ కోస్ట్ మరియు మిడ్‌వెస్ట్
- By Praveen Aluthuru Published Date - 03:09 PM, Thu - 8 June 23
Canada Wildfires: కెనడా అడవుల్లో అగ్ని ప్రమాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ భీకర అగ్నిప్రమాదం ప్రభావం అమెరికా దాకా వ్యాపిస్తుంది. బుధవారం యుఎస్ ఈస్ట్ కోస్ట్ మరియు మిడ్‌వెస్ట్ అంతటా వ్యాపించిన పొగ రెండు దేశాల రాజధానులను కప్పేసింది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ దేశం అడవి ప్రమాదాలను ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అతనితో ఫోన్‌లో మాట్లాడి సహాయం అందిస్తానని హామీ ఇచ్చినట్టు జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఇందుకు ట్రూడో ట్విట్టర్‌లో బిడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం ప్రభావం రెండు దేశాలకు చెందిన దాదాపు 10 కోట్ల మందిపై ప్రభావం చూపనుందని చెప్తున్నారు నిపుణులు.
కెనడియన్ నేషనల్ ఫైర్ డేటాబేస్ ప్రకారం కెనడా అడవి మంటల్లో 3.8 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ దగ్దమైంది, ఇది న్యూజెర్సీ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో చాలా విమానాశ్రయాలు రద్దు అయ్యాయి: ఈ అగ్నిప్రమాదం కారణంగా అనేక ప్రధాన విమానాశ్రయాలలో సేవలు నిలిపివేయబడ్డాయి. మరో విశేషం ఏంటంటే.. మేజర్ బేస్‌బాల్ లీగ్ వాయిదా పడింది. ఈ సమయంలో ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించమని ఆ దేశ ప్రతినిధులు ఆదేశాలు జారీ చేశారు.
కెనడాలో అడవి మంటల కారణంగా 20,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. బుధవారం మధ్యాహ్నానికి న్యూయార్క్ నగరం ప్రపంచంలోని ఏ నగరంలోనూ లేనంత వాయు కాలుష్యం అక్కడ కనిపించింది.
Read More: Jagan Family Drama : అంతఃపురంలో అలజడి! విజయమ్మకు మొఖంచాటేసిన సజ్జల!