Foodgrain Storage: ఆహార నిల్వ పథకాన్ని ప్రారంభించిన మోడీ కేబినెట్
రైతులకు మేలు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆహార నిల్వ పథకాన్ని ప్రారంభించింది. కేబినెట్ భేటీ అనంతరం మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం రైతులకు ఉపయోగకరంగా మారనుంది.
- By Praveen Aluthuru Published Date - 04:10 PM, Wed - 31 May 23

Foodgrain Storage: రైతులకు మేలు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆహార నిల్వ పథకాన్ని ప్రారంభించింది. కేబినెట్ భేటీ అనంతరం మోదీ (Modi) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం రైతులకు ఉపయోగకరంగా మారనుంది.
ఈ పథకంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార నిల్వ పథకానికి అనుమతిపై నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 1450 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, ఇప్పుడు సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండబోతుంది అన్నారు. ఈ పథకం కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రానున్న ఐదేళ్లలో సహకార రంగంలో నిల్వ సామర్థ్యాన్ని వేగంగా పెంచుతామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార నిల్వ పథకం అని, అలాగే ఈ పథకం కింద ప్రతి బ్లాక్‌లో 2000 టన్నుల ధాన్యం నిల్వ గోడౌన్‌ను నిర్మిస్తామని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో నిల్వ సామర్థ్యం లేకపోవడంతో పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయని, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వృథాను నివారిస్తుందని ఆయన అన్నారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గుతుంది .గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
Read More: Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్