Kurnool : పురుగుమందుల సంచిలో పండ్లు తిని రెండేళ్ల చిన్నారి మృతి
- By Vara Prasad Published Date - 08:33 AM, Sun - 12 June 22

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండు తిని ఆహారం విషతుల్యమై రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. పురుగు మందులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే సంచిలో ఈ పండ్లను నిల్వ ఉంచినట్లు సమాచారం.ముగ్గురు చిన్నారులు రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు వారుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అంజి, హర్ష మరణించారు. వీరిద్దరు తోబుట్టువులు. నేరేడు పండ్లు తిన్న కొద్ది నిమిషాలకే చిన్నారులకు వాంతులు రావడంతో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్ష మృతి చెందగా, మిగిలిన వారిని ఆదోనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ రాజా రెడ్డి తెలిపారు. అయితే ఆస్పత్రిలో చేరిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎంపీపీ ఈరన్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్యస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Related News

Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వరలో ఇంటికి వస్తానని చెప్పి..?
ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ అగ్రికల్చర్లో బీఎస్సీ చదివాడు. దిలీప్ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాద