Flights Collided: రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు
రెండు ప్రయాణీకుల విమానాలు ప్రమాదవశాత్తు రన్‌వేపై ఢీకొన్నాయి. శనివారం టోక్యో విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని,
- Author : Praveen Aluthuru
Date : 10-06-2023 - 8:38 IST
Published By : Hashtagu Telugu Desk
Flights Collided: రెండు ప్రయాణీకుల విమానాలు ప్రమాదవశాత్తు రన్‌వేపై ఢీకొన్నాయి. శనివారం టోక్యో విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. థాయ్‌లాండ్ నుండి వచ్చిన అంతర్జాతీయ విమానం హనెడా విమానాశ్రయంలో చైనా తైపీకి వెళ్తున్న EVA ఎయిర్‌వేస్ విమానాన్ని పొరపాటున ఢీకొట్టింది. ఈ ఘటన తర్వాత రన్‌వే తాత్కాలికంగా మూసివేయబడింది. అయితే రెండు గంటల తర్వాత తిరిగి రన్వే ఓపెన్ చేశారు.

Tokyo Flight
ఈ ఘటన కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయని, అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంలో విమానయాన సంస్థలు స్పందించలేదు. మీడియా నివేదికల ప్రకారం థాయ్ ఎయిర్‌వేస్ విమానం రెక్క విరిగిపోయినట్లు సమాచారం అందుతుంది.
Read More: Manipur Violence : మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలకు స్వస్తి పలికేలా శాంతి కమిటి..