Two Girls Missing: మంగినపూడి బీచ్‌లో ఇద్దరు బాలికలు గల్లంతు
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఇద్దరు బాలికలు గల్లంతైయ్యారు.
- By Hashtag U Published Date - 12:45 PM, Tue - 24 May 22

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఇద్దరు బాలికలు గల్లంతైయ్యారు. బీచ్‌కి ముగ్గురు స్నేహితులు స్నానానికి వెళ్లిన సమయంలో విషాదం చోటుచేసుకుంది. మృతులు కాకర ప్రమీల, కళ్లేపల్లి పూజిత (22)గా గుర్తించారు. వీరు భీమవరం విష్ణు కళాశాలలో బి.ఫార్మసీ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు మరో స్నేహితురాలు ఆశాజ్యోతితో కలిసి బీచ్‌కి వెళ్లిన సమయంలో అలలు ఎగిసిపడ్డాయి.
ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికితీశారు. మృతులిద్దరూ పశ్చిమగోదావరి వాసులు కాగా తమ స్నేహితురాలు జ్యోతిని కలిసేందుకు మచిలీపట్నం వచ్చారు. ఈ ఘటనపై బందరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు