News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Two Class 2 Students Injured In Andhra As Portion Of Classroom Ceiling Collapses

Class 2 students injured: కూలిన ప్రభుత్వ పాఠశాల స్లాబ్…ఇద్దరు విద్యార్థులకు గాయాలు..!!

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థులపై సీలింగ్ ప్లాస్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

  • By Hashtag U Published Date - 11:25 PM, Fri - 29 April 22
Class 2 students injured:  కూలిన ప్రభుత్వ పాఠశాల స్లాబ్…ఇద్దరు విద్యార్థులకు గాయాలు..!!

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థులపై సీలింగ్ ప్లాస్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గోనెగండ్ల మండల పరిషత్ ఉర్థూ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ పాఠశాల సుమారు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించబడిందని..పాఠశాల భవనం స్థితిగతులపై అధికారులకు నివేదిక సమర్పించామని మండల విద్యాధికారి తెలిపారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నాడు నేడు పథకంలో ఇతర ప్రభుత్వ పాఠశాలలో పునరుద్ధరణ పనులు చేపట్టినా…గోనెగండ్ల ఉర్థూ పాఠశాల మరమ్మతు పనులను పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 66మంది విద్యార్థులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గోనెగండ్ల మండలంలోని 55 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు మొదటి రెండు దశల్లో ఎంపిక చేయని ఐదు పాఠశాలల్లో ఈ ఉర్ధూ పాఠశాల ఒకటని తెలిపారు.

ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. నాడు-నేడు కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పులను అంగీకరించి..గాయపడిన చిన్నారుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

In Gonegandla (Kurnool) 2 students are badly injured after the school building collapsed.
This is the condition of schools in Andhra Pradesh.@AndhraPradeshCM is doing nothing except appeasement politics. Funds meant for education reforms are going in their pockets. @blsanthosh pic.twitter.com/BJHv57tQST

— Rameshnaidu Nagothu /రమేష్ /रमेश नायडू (@RNagothu) April 28, 2022

Tags  

  • (Upper Primary) Urdu school
  • Class 2 students injured
  • classroom ceiling
  • Gonegandla
  • kurnool
  • Mandal Parishad

Related News

Pawan Kalyan: ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కు ఘనస్వాగతం

Pawan Kalyan: ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కు ఘనస్వాగతం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు.

  • Kurnool Highcourt : క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని హుళక్కే.!

    Kurnool Highcourt : క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని హుళక్కే.!

  • Kadapa Temple:ఆ ఆల‌యంలో పొంగ‌ళ్లు స‌మ‌ర్పించేది పురుషులేన‌ట‌.. !

    Kadapa Temple:ఆ ఆల‌యంలో పొంగ‌ళ్లు స‌మ‌ర్పించేది పురుషులేన‌ట‌.. !

  • AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్

    AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్

  • ఏపీలో ఆ జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మ‌హ‌త్య‌లు… కార‌ణం ఇదేనా…?

    ఏపీలో ఆ జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మ‌హ‌త్య‌లు… కార‌ణం ఇదేనా…?

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: