TV5 Murthy : వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూర్తి
తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ప్రకటన చేయడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన X వేదికగా తెలిపారు
- By Sudheer Published Date - 04:28 PM, Tue - 20 August 24

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, అతని భార్య శ్రీవాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని జర్నలిస్టు మూర్తి ( TV5 Murthy) పోలీసులను ఆశ్రయించారు. తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ప్రకటన చేయడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన X వేదికగా తెలిపారు. ఇటీవల వేణు స్వామి (Astrologer Venuswami) నిత్యం వివాదాల్లో కేరాఫ్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ గుర్తింపు తెచ్చుకున్న వేణు..ఇప్పుడు అదే సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం తో వివాదాల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల (Chaitu – Shobitha Engagement) జంటపై కీలక వ్యాఖ్యలు చేయడం తో ఆయనపై అభిమానులే కాదు సినిమా ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె గత కొంతకాలంగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు మూర్తి. అయితే మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అని తెలుపడడం తో మూర్తి అంటే పడని కొంతమంది మరింతగా ప్రచారం చేస్తూ మూర్తి ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయినా మూర్తి.. వేణుస్వామి, అతని భార్య శ్రీవాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులను ఆశ్రయించారు. తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ప్రకటన చేయడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన X వేదికగా తెలిపారు. వేణుస్వామి చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని ఆయన స్పష్టం చేశారు. నిజాలేంటో త్వరలోనే బయటపడతాయన్నారు.
Read Also : Anna Canteen : చంద్రబాబు పిలుపుతో అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు