Krishna: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం..!!
- By hashtagu Published Date - 08:48 AM, Tue - 15 November 22
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర రంగానికి ఐదు దశాబ్దాలపాటు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. 350పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్లో గుండెల్లో నిలిచారన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే సాంఘీక చిత్రాల నటుడిగా జనాదరణ పొందారని గుర్తుచేశారు. వందలాది సినిమాల్లో నటించి లక్షలాది సినీ కార్మికులకు పని కల్పించిన వ్యక్తి. సాంకేతికంగా తెలుగు సినీపరిశ్రమ ఖ్యాతిని పెంచిన దిగ్గజం అన్నారు కాసాని. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని… కృష్ణ కుటుంబ సభ్యులకు, కృష్ణ అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు.
Related News
Pawan Kalyan : సరికొత్త వివాదానికి తెరలేపిన పవన్ వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని