Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేటి నుంచే సర్వదర్శనం టిక్కెట్లు
- By HashtagU Desk Published Date - 09:45 AM, Tue - 15 February 22

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఆఫ్ లైన్ సర్వదర్శనం కోసం శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో నేటి నుంచి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. చాలా కాలం తర్వాత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయడం విశేషం.
కరోనా ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం పై కూడా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్లను చాలా కాలం టీటీడీ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పటుతున్న నేపధ్యంలో, తిరిగి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో భక్తులకు రోజుకు పదిహేను వేలు సర్వ దర్శనం టిక్కెట్లు ఇచ్చే విధంగా టీటీడీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో రేపటి దర్శనం కోసం ఈరోజే టిక్కెట్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లను పొందవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు.