TSRTC: గ్రేట్ సజ్జనార్..జయహో మహిళ
- By Hashtag U Published Date - 10:00 AM, Wed - 12 January 22

సమస్య పెద్దది..పరిష్కారం సులభం. కానీ దీర్ఘకాలంగా ఎవరు పట్టించుకోలేదు. ఓ మహిళ అర్ధరాత్రి చేసిన ఒక ట్వీట్ తో టీఎస్ ఆర్ టీ సీ ఎండీ సజ్జనార్ స్పందించాడు. సమస్యకు పరిష్కారం వెంటనే చూపుతూ ఆదేశాలు జారీ చేసాడు. దానికి సంబంధించిన వివరాలు ఇవి..
అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని యువతి పాలే నిషా ట్వీట్ చేసింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ యువతి తెలిపింది. అర్ధరాత్రి చేసిన ట్వీట్ ను చూసి ఎండి సజ్జనార్ సమస్య తీవ్రతను గుర్తించాడు.ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేసిన సజ్జనార్ కు మహిళలు ధన్యవాదాలు చెప్తున్నారు.
అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపిన పాలే నిషా సంతోషం వ్యక్తం చేసింది.
Already given instructions in this regard
@TSRTCHQ @CTMTSRTC @CTMMNCTSRTC— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) January 11, 2022
సాధారణంగా బస్సులను ఎదో ఒక హోటల్ దగ్గర విశ్రాంతి కోసం ఆపుతుంటారు. అక్కడ మహిళలకు మరుగుదొడ్లు ఉండవు. బహిరంగ ప్రదేశాల్లో యూరినరి చేయాల్సిన పరిస్థితి ఉండేది. చిన్న ట్వీట్ తో పెద్ద సమస్యకు సజ్జనార్ పరిష్కారం చూపడం అభినందనీయం.

TSRTC MD Sajjanar