బాసర సరస్వతీ క్షేత్రంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని గురువారం వైద్య ,ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు...
- By Hashtag U Published Date - 10:28 AM, Thu - 3 March 22

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని గురువారం వైద్య ,ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు… దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు. మంత్రుల వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రులు తెలిపారు.