KTR Criticizes Modi: మోడీజీ.. క్యా హువా తేరా వాదా!
భారతదేశ 76వ ఇండిపెండేన్స్ డే సందర్భంగా 2047 విజయ ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
- By Balu J Published Date - 05:57 PM, Tue - 16 August 22

భారతదేశ 76వ ఇండిపెండేన్స్ డే సందర్భంగా 2047 విజయ ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ఆవిష్కరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76వ వార్షికోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో 2047 నాటికి దేశాభివృద్ధికి సంబంధించిన విజన్‌ను మోదీ వివరించారు. అయితే ఆగస్ట్ 15, 2022కి సంబంధించిన ముందస్తు కమిట్‌మెంట్‌ల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ట్విట్టర్ ఖాతాలో ప్రధాని హామీలపై వార్తా కథనాల చిత్రాలను పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన హామీలు ఏమయ్యాయి అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
“క్యా హువా తేరా వాదా” క్యాప్షన్ ఇస్తూ “2047 కోసం కొత్త ఆశయాలు అద్భుతం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ఆగస్టు 15, 2022న మీ ముందస్తు కమిట్‌మెంట్‌ల గురించి ఏమిటి? అనేది తెలుసుకోవాలని దేశం ఆసక్తిగా ఉంది. “మీ స్వంత లక్ష్యాలను, దానిని సాధించడంలో తదుపరి వైఫల్యాలను కూడా మీరు అంగీకరించకపోతే బాధ్యత ఎక్కడ ఉంది” అని అంటూ మోదీనుద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమవుతోంది.
#PMModi గారూ… ఆ వాగ్దానాలు ఏమయ్యాయి ? : నిలదీసిన మంత్రి @KTRTRS @MinisterKTR #ModiFailedIndia #bjpfailsindia #KyaHuaTeraWada https://t.co/PeuO5Oy5uA
— Mission Telangana (@MissionTG) August 16, 2022