TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ లో అమ్మాయిలదే హవా!
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
- By Balu J Published Date - 12:37 PM, Tue - 28 June 22

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. కాగా ద్వితీయ సంవత్సరంలో 4.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఫలితాల కోసం..
TSBIE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఇక్కడ క్లిక్ చేయండి)
ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసిన తర్త హోమ్‌పేజీలో కనిపించే ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
అభ్యర్థి రోల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
క్లిక్ చేసిన తర్వాత, డౌన్‌లోడ్ చేయగల స్క్రీన్‌పై ఫలితం కనిపిస్తుంది.