Bahubali Haleem: హైదరాబాద్లో బాహుబలి హలీమ్‌ని టెస్ట్ చేశారా..?
బాహుబలి థాలీ గురించి వినే ఉంటారు. ఈ వంటకం పై టన్నుల కొద్దీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి.
- By Hashtag U Published Date - 06:00 AM, Fri - 8 April 22

బాహుబలి థాలీ గురించి వినే ఉంటారు. ఈ వంటకం పై టన్నుల కొద్దీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి. కానీ రంజాన్ సీజన్ లో మీరు ఎప్పుడైనా బాహుబలి హలీమ్ గురించి విన్నారా? ఈ రంజాన్ సీజన్‌లో ఈ బాహుబలి హలీమ్ రుచి చూడాలంటే హైదరాబాదీలు కార్ఖానాలోని గ్రిల్-9 రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే.
నలుగురికి సరిపడే ఈ కింగ్స్ ప్యాక్ బాహుబలి హలీమ్‌లో చికెన్ టిక్కా, ఉడికించిన గుడ్లు, పత్తర్-కా-గోష్ట్, బోన్ మ్యారో వంటి పుష్కలమైన టాపింగ్స్ ఉన్నాయి. నిమ్మకాయలు, కొత్తిమీర, పంచదార పాకం చేసిన ఉల్లిపాయలు, జీడిపప్పు, తాజా క్రీమ్ మరియు మరిన్నింటితో అలంకరించబడి ఉంటుంది. దీని ధర కేవలం రూ.999 మాత్రమేనట. గ్రిల్-9 ఖలీల్ అహ్మద్ (రోషన్), అజ్మత్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌లోని SD రోడ్‌లో కూడా ఇది మరో బ్రాంచ్ ఉంది. ‘బాహుబలి 2’ సినిమా విడుదలైన 2017లో తమ రెస్టారెంట్‌లో బాహుబలి హలీమ్ ప్రారంభమైందని… అప్పటి నుండి రంజాన్ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతోందని ఖలీల్ అహ్మద్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా తమకు బిజినెస్ తగ్గిందని.. కానీ ఈ సంవత్సరం ఎక్కువ గిరాఖీ ఉందని తెలిపారు. బాహుబలి హలీమ్ కార్ఖానా బ్రాంచ్‌లో మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు.