Revanth Reddy: ‘కేసీఆర్ టూర్’ పై రేవంత్ సెటైర్స్!
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు.
- By Balu J Published Date - 04:43 PM, Fri - 4 March 22
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయని పేర్కొన్నారు. అయితే ఈ భేటీ జరగలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. “ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే… తెలంగాణ సీఎం అవినీతిపై తాము పోరాటం చేస్తామని ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చెబుతున్నారు. కేసీఆర్ కు జాతీయస్థాయిలో ఉన్న ఇమేజ్ ఇదీ!” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, సోమ్ నాథ్ భారతి చేసిన ట్వీట్ ను కూడా రేవంత్ పంచుకున్నారు.
TRS sources claimed,KCR would meet @ArvindKejriwal to discuss proposed FEDERAL FRONT on his Visit to Delhi which didn’t happen.
Interestingly AAP MLA @attorneybharti says they will fight against the corruption of @TelanganaCMOThis is the image of KCR Nationwide.#NeverTrustKCR https://t.co/REzzIm13Ad
— Revanth Reddy (@revanth_anumula) March 4, 2022