HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tpcc Chief Revanth Reddy Fires On Amit Sha Tour In Telangana

Revanth Reddy Demands: అమిత్ షాపై రేవంత్ ‘అస్త్రాలు’

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు.

  • Author : Balu J Date : 14-05-2022 - 3:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth
Revanth

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు అమిత్ షా అటెండ్ కానున్నారు. అమిత్ షా రాకపై ఇప్పటికే ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమిత్ షా తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ చేశారని, మాటలు కోటలు దాటుతాయ్.. చేతలు మాత్రం గడప దాటడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రశ్నలను అమిత్ షాపై సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షాకు.. రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నలు ఇవే.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని బీజేపీ చీఫ్ కూడా ఆరోపిస్తున్నారు. అయినాగానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని నేతలు ఎదిరిస్తే ఈడీ దాడులు చేయిస్తున్న మీరు.. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ అవినీతిని ఉపేక్షించడం వెనక ఆంతర్యమేంటి?

యాసంగిలో తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయవద్దంటూ కేసీఆర్ తో కలిసి మీరు ఒప్పందం చేసుకున్నారు. బాయిల్డ్ రైస్ అనే వంకను తెరపైకి తెచ్చారు. కేసీఆర్ కొనుగోలు కేంద్రాలనూ ఎత్తేశారు. రైతులు రూ.7 వేల కోట్లు నష్టపోయారు. మీ రెండు పార్టీలు ఆడిన డ్రామా వల్ల పోయిన వానాకాలం నుంచి రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు చనిపోయారు. వారి మరణాలకు మీ రెండు పార్టీలు బాధ్యులు కాదా?

పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతికి ధన్యవాద ప్రసంగం సందర్భంగా తెలంగాణపై ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించపరిచేలా కామెంట్లు చేశారు. ఇప్పుడు మీరు తెలంగాణకు వస్తున్నారు కాబట్టి.. వాటికి వివరణ ఇచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మీ రాకను తెలంగాణ ప్రజలు ఎలా ఆమోదిస్తారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదనుకుంటున్నారా?

బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ లో పసుపుబోర్డును ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ కూడా రాసిచ్చారు. ఆ మాటలు నమ్మి ప్రజలు గెలిపించినా.. పసుపు బోర్డు ఊసే లేదు. ఇది ప్రజలను వంచించడం కాదా?

ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ విభజన సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటికి మీరు మంగళం పాడారు. తెలంగాణకు ఏమీ చేయకపోయినా అనేక సందర్భాల్లో కేంద్రానికి టీఆర్ ఎస్ మద్దతిస్తూ వచ్చింది. అలాంటి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? గిరిజన వర్సిటీకి మోక్షం ఎప్పడు?

అయోధ్య నుంచి రామేశ్వరం వరకు రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘రామాయణం సర్క్యూట్’ పేరిట శ్రీరామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. 7,500 కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రి రాముడికి మాత్రం చోటివ్వలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మొండి చెయ్యి చూపారు? భద్రాద్రి రాముడు రాముడు కాదా?

ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర ఉందంటూ ఆ ఆధారాలనూ ఇచ్చాం. దీనిపై విచారణ అతీగతీ లేదు. కేసీఆర్ అవినీతిపై సీరియస్ గానే ఉంటే.. చేతల్లో ఎందుకు కనిపించట్లేదు?

పొరుగున ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలోని రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికీ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? అడిగే బుద్ధి టీఆర్ఎస్ కు ఎలాగూ లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్దతు. వారి అక్రమాలు, అవినీతికి మీ మద్దతు.. ఇదే కదా ఎనిమిదేళ్లుగా జరిగింది?

2014లో కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధర రూ.71.41, డీజిల్ ధర రూ.55.49. గ్యాస్ సిలిండర్ ధర రూ.470. కానీ, ఇప్పుడు పెట్రోల్ రూ.119.66, డీజిల్ 105.65, గ్యాస్ ధర రూ.1,052కు ఎగబాకాయి. సామాన్యుడు బతికే పరిస్థితే లేదు. గ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ధరలు పెరుగుతున్నా చీమ కుట్టినట్టయినా లేదు. ధరల్లో బీజేపీ, టీఆర్ఎస్ బాదుతున్న పన్నులే 60 శాతం ఉన్నాయి. ఇలా పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి?

అమిత్ షా గారూ…
‘ఛీ’ఆర్ఎస్ తో సావాసం…
తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు…
తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు… వీటిపై నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పండి. pic.twitter.com/lnMaDrkNnx

— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • hyderabad
  • revanth reddy pcc chief
  • telangana

Related News

New Sarpanches

తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో మళ్లీ పాలకవర్గాలు వస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు, ఇకపై ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Bosch Sports Meet

    ఘ‌నంగా ముగిసిన బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ క్రీడా వేడుకలు

Latest News

  • మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి

  • ల‌క్నో జ‌ట్టుకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడు దూరం!

  • భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 ర‌ద్దు.. అభిమానులు ఆగ్ర‌హం!

  • సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd