Watch Video: చిరుతతో పోలీసుల ఫైట్.. ధైర్యానికి హ్యాట్సాఫ్
- By Balu J Published Date - 02:58 PM, Mon - 9 May 22

శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు ముందుంటారు. తమ ముందు ఎలాంటి భయానక పరిస్థితులున్నా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యరంగంలోకి దూకుతారు. ఎలాంటి సమయాల్లోనైనా ఆదుకుంటారని ప్రజలకు ఒక నమ్మకం. ఎంత క్లిష్ట సమస్య ఎదురైన ధైర్యంగా ముందుండి నిలబడతారనే ఒక విశ్వాసం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హర్యానలో చోటుచేసుకుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు చిరుతతో పోరాడారు. వివరాల ప్రకారం.. హర్యానా పానిపట్‌లోని బెహ్రాంపూర్ గ్రామంలోకి ఓ చిరుత పులి వచ్చింది.
దీంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు.. పోలీసులకు సమాచారం అందించారు. పులిని బంధించేందుకు ముగ్గురు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చిరుతను బంధించే ఈ అపరేషన్‌లో.. చిరుత పోలీసులపై దాడి చేసింది. దీనితో గాయపడ్డ అధికారులు వెంటనే.. చిరుతను శాంతింపజేశారు. పులిని బంధించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ట్వీట్టర్ వేదికగా ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల ధైర్యానికి ప్రతిఒక్కరూ సలాం కొడుతున్నారు.
Related News

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది.