Onion : సామాన్య ప్రజలారా..ఇప్పుడే ఉల్లిపాయలను తెచ్చుకోండి..ఎందుకంటే
రెండు రోజులుగా టమాటా ధర దిగొస్తుండడంతో సామాన్య ప్రజలు హమ్మయ్య అనుకున్నారో లేదో
- Author : Sudheer
Date : 12-08-2023 - 6:04 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత కాలంలో సామాన్యులు బ్రతికే రోజులు పోయాయి. ఎందుకంటే సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. రోజంతా కూలి పనులు చేస్తే..రూ. 500 నుండి 700 వస్తున్నాయి. ఆ రూ. 500 లకు పట్టుమని ఐదు రకాల కూరగాయలు కూడా రావడం లేదు. బియ్యం , పప్పు , మసాలా దినుసులు , నూనె , పిల్లలకు స్నాక్స్ ఇలా ఇంకేం కొంటారు చెప్పండి. గత రెండు నెలలుగా కేజీ టమాటా ధర ఎంత ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు రోజులుగా టమాటా (Tomato ) ధర దిగొస్తుండడంతో సామాన్య ప్రజలు హమ్మయ్య అనుకున్నారో లేదో ఇక ఇప్పుడు ఉల్లి (Onion ) కూడా కొయ్యకుండానే కన్నీరు పెట్టిస్తా అంటుంది.
నిన్న, మొన్నటి వరకు కేజీ రూ. 20 ఉన్న ఉల్లి…ఇప్పుడు రూ. 30 నుండి 35 పలుకుతుంది. మరో రెండు వారాల్లో రూ. 70 నుండి 80 వరకు వెళుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నారు. ఈ నెల చివర్న, వచ్చే నెల నాటికి ఉల్లి ధరలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. రానున్న నెలల్లో ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. అయితే సరఫరా తగ్గడం వల్ల ఈ పెరుగుదల ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. వర్షం, వరద ప్రభావం ఉల్లిపైనా భారీగా పడిందని , దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఉల్లి సరఫరా క్రమంగా తగ్గుతుందని అంటున్నారు. స్టాక్‌లో ఉంచిన ఉల్లి వచ్చే నెల నుంచి బయటకు రావడం ప్రారంభమవుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఉల్లి ధర పెరగడానికి ఇదే కారణం. ఏదీ ఏమైనా టమోటా తర్వాత ఇప్పుడు ఉల్లి వంతు రానుంది. వచ్చే నెల నాటికి ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే సామాన్య ప్రజలు ఉల్లి ని ఇప్పుడే కాస్త తెచ్చుకొని పెట్టుకోండని చెపుతున్నారు.
Read Also : Coconut Milk Benefits For Hair: కొబ్బరి పాలతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోండిలా?