HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Today Ktr Will Attend The Hearing Of The Womens Commission

KTR : నేడు మహిళా కమిషన్‌ ముందు హాజరుకానున్న కేటీఆర్..

ఇటీవల కేటీఆర్‌ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ నేడు కమిషన్‌ ముందు హాజరుకానున్నారు.

  • Author : Kavya Krishna Date : 24-08-2024 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr (5)
Ktr (5)

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ ఉదయం11 గంటలకు మహిళా కమిషన్‌ ముందు హాజరుకానున్నారు. ఇటీవల కేటీఆర్‌ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ నేడు కమిషన్‌ ముందు హాజరుకానున్నారు. అయితే.. తెలంగాణ భవన్‌లో ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద. ఈ క్రమంలోనే కేటీఆర్‌ వ్యక్తిగతంగా కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు కమిషన్‌.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఈ నెల 16నే క్షమాపణలు చెప్పారు. ‘పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇదే కాకుండా.. ఈ నెల 17వ తేదీన కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెబతున్నట్లు కేటీఆర్‌ మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా మహిళా కమిషన్‌ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని కేటీఆర్‌ వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొల్లాపూర్, షాద్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు అందజేస్తానని ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read Also : Hyundai Alcazar: స్టైలిష్​గా హ్యుందాయ్​ అల్కజార్​ ఫేస్​లిఫ్ట్​.. బుకింగ్స్​ షురూ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • ktr

Related News

Ktr

పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “పొట్టను దాచుకోలేక విసిగి

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

    Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

Latest News

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd