TTD: క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు అందించండి – ‘టీటీడీ చైర్మన్ ఆదేశం’
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
- By Hashtag U Published Date - 12:08 PM, Fri - 25 March 22

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో… శుక్రవారం ఆయన స్లాట్ సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. క్యూలో దర్శనానికి వెళుతున్న భక్తులతో మాట్లాడారు.
క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజిఓ బాలిరెడ్డిని చైర్మన్ వై.వి
సుబ్బారెడ్డి ఆదేశించారు.