Manipur Violence: మణిపూర్ హింసపై న్యాయ కమిషన్ ఏర్పాటు
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆదివారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది
- By Praveen Aluthuru Published Date - 07:35 PM, Sun - 4 June 23

Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆదివారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లంబా నేతృత్వం వహిస్తారు. వీరితోపాటు కమిషన్‌లో మాజీ ఐఏఎస్ అధికారి హిమాన్షు శేఖర్ దాస్, మాజీ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్ ఉన్నారు. ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ నివేదికను దాఖలు చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు నెలల సమయం ఇచ్చింది. ఈ సమయంలో వారు అన్ని కారణాలను తెలుసుకుని హోంమంత్రిత్వ శాఖకు అందిల్సి ఉంటుంది.
మే 3న మణిపూర్‌లో జాతి వివాదం చెలరేగింది. మణిపూర్లో దాదాపు నెల రోజులుగా కుల హింసకు గురవుతోంది. అయితే మణిపూర్‌లో హోంమంత్రి పర్యటన అనంతరం శనివారం రాష్ట్రంలో పూర్తి శాంతి నెలకొంది. మణిపూర్‌లో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.