Bapatla Immolation Case: బాపట్ల మైనర్ బాలుడి హత్య కేసులో నిందితులు అరెస్ట్
బాపట్ల జిల్లాలో మైనర్ బాలుడిని నిప్పంటించి హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు శనివారం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు.
- Author : Praveen Aluthuru
Date : 17-06-2023 - 2:34 IST
Published By : Hashtagu Telugu Desk
Bapatla Immolation Case: బాపట్ల జిల్లాలో మైనర్ బాలుడిని నిప్పంటించి హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు శనివారం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు.
ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వర్‌రెడ్డి (20), పాము గోపిరెడ్డి (25), మండేలా వీరబాబు (20) తుమ్మ సాంబిరెడ్డితో కలిసి బాలుడిని అడ్డగించి పెట్రోల్ పోసి దారుణంగా కాల్చేశారు. ఈ సంఘటన శుక్రవారం జూన్ 16 ఉదయం 5.30 గంటలకు జరిగింది. తన సోదరిని వెంకటేశ్వర రెడ్డి వేధింపులకు గురిచేయడాన్ని బాలుడు వ్యతిరేకించడమే హత్యకు కారణమని తెలిపారు స్థానిక పోలీసులు. ప్రేమ ముసుగులో నిందితులు ఆమెను లైంగికంగా వేధించారని అన్నారు. శుక్రవారం వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు సాంబిరెడ్డి పరారీలో ఉన్నాడు.
Read More: Driving Tips: హైవేపై డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అసలు చేయకండి..!