HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >This Ukrainian Bride Saved Her Wedding Gift In Escape To India

Ukrainian Bride: ఈ అద్భుతమైన ప్రేమకథను చ‌ద‌వాల్సిందే..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య గత నెలన్నర రోజులుగా యుద్ధం కొనసాగుతోంది.

  • Author : Siddartha Kallepelly Date : 13-04-2022 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Love
Love

రష్యా, ఉక్రెయిన్ మధ్య గత నెలన్నర రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. దాడుల ప్రారంభ రోజుల్లో లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ కాకుండా ఇతర దేశాలలో ఆశ్రయం పొందారు. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఉక్రెయిన్ నుండి భారతదేశం తన పౌరులను కూడా ఖాళీ చేయించింది. ఈ సమయంలో ప్రజలు తమ విలువైన వస్తువులను పట్టించుకోకుండా అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ ఈ గుంపులో ఒక ఉక్రేనియన్ మహిళ ఉంది.. ఆమె తనతో పాటు కాఫీ మెషిన్ వెంట తీసుకుని భారతదేశానికి తిరిగి వచ్చింది.

అన్నా హోరోడెట్స్కా అనే ఉక్రెయిన్ మ‌హిళ‌.. తన టీ-షర్టులు, కాఫీ మెషిన్‌తో భారతదేశానికి వచ్చింది. అమ్మమ్మ ఇచ్చిన పెళ్లి కానుక కాబట్టి ఆమెకు ప్రాణం కంటే ఈ కాఫీ మెషిన్ అంటే చాలా ఇష్టం. అన్నా హోరోడెట్స్కా తన భారతీయ ప్రియుడు అనుభవ్ భాసిన్ ని ఆదివారం పెళ్లాడింది. త‌న వెంట కాఫీ మెషిన్ తీసుకుని రావ‌డంతో భాసిన్ కూడా ఆశ్చర్యపోయాడు. అన్నా మంచి మేకప్ ఆర్టిస్ట్ అని, అయితే ఈ కాఫీ మెషీన్‌ని ఇక్కడికి తీసుకురావడానికి చాలా ఖరీదైన మేకప్ కిట్‌ని వదిలిపెట్టింద‌ని భాసిన్ తెలిపాడు. ఈ యంత్రం త‌మ ప్రేమకథకు నిజమైన హీరో అని అనుకుంటున్నానని భాసిన్ వెల్ల‌డించాడు. అనుభవ్ భాసిన్ వృత్తిరీత్యా న్యాయవాది… వీరిద్దరి ప్రేమ, పెళ్లి వరకు సాగిన ప్రయాణం కూడా చాలా చిత్రమైనది. అనుభవ్ 2019లో అన్నా హోరోడెట్స్కా ని కలిశాడు.

అప్పుడు అన్నా హోరోడెట్స్కా భారతదేశ పర్యటనకు ఒంటరిగా వచ్చారు. ఆ స‌మ‌యంలో భారతదేశంలో ఉన్నప్పుడు లాక్డౌన్ ఉంది. అప్పుడు ఆమె ఢిల్లీలో అనుభవ్ భాసిన్ కుటుంబంతో గడిపారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత, ఆమె ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఈసారి ఆమె ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, భాసిన్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి మోకాళ్లపై కూర్చున్నాడు. అన్నా సరే అనడంతో అనుభవ్ డప్పుల దరువుల మధ్య ఉంగరాన్ని తీసి ప్రియురాలికిచ్చాడు. ఆదివారం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భాసిన్ తన వివాహ ఆల్బమ్ నుండి ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నేను సంతోషిస్తున్నానని భాసిన్ పేర్కొన్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • love marriage
  • Russia-Ukraine War
  • viral

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • WB Polling : పశ్చిమ బెంగాల్ పోలింగ్ లో ఉద్రిక్తత

    • సీఎస్కే బౌల‌ర్ ఇంట విషాదం!

    • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్ పగిలితే ఏం చేయాలి?

    • బాబా వంగా భవిష్యవాణి.. నిప్పుల కొలిమిలా మారనున్న భూమి!

    Trending News

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd