FASTag Alert: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్…ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు పోయినట్లే..!!
FASTag...హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూను నివారించేందుకు దీన్ని ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం.
- By Hashtag U Published Date - 04:15 PM, Sun - 22 May 22
FASTag…హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూను నివారించేందుకు దీన్ని ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం. దీనివల్ల ప్రయాణీకుల సమయం ఆదా అవుతుంది. టోల్ చెల్లింపులు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. కోవిడ్ లాంటి సమయంలో డబ్బులు ఇవ్వడం స్లిప్ తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమాయంలో ఈ విధానం చాలా చక్కగా పనిచేసింది.
ఫాస్ట్ ట్యాగ్ ను మీ మొబైల్ నుంచి చాలా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈనేపథ్యంలో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
పేటిఎం లేదా ఫోన్ పే లేదా ఇతర ఏదైనా చెల్లింపు యాప్ నుంచి ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేయడానికి ముందు…మీరు మీ కారు నెంబర్ ఎంటర్ చేయాలి. పొరపాటున నెంబర్ తప్పుగా ఎంటర్ చేస్తే అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా అవుతుంది. కానీ రీఛార్జ్ మాత్రం కాదు.
ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసేముందు…మీ ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయాలి. రీఛార్జ్ చేసే ముందు బ్యాంక్ వివరాలు నమోదు చేయాలి. తప్పుడు వివరాలను నమోదు చేస్తే రీఛార్జ్ రద్దు అవుతుంది. అకౌంట్ నుంచి డబ్బు కూడా కట్ అవుతుంది.
మీరు పాత కారును ఎవరికైనా విక్రయిస్తే…ఫాస్ట్ ట్యాగ్ డియాక్టివేట్ చేయండి. ఇలా చేయకపోతే..వాహనం మీది కాకపోయినా…టోల్ ప్లాజాలో మీ అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది.
ఇక ఫాస్ట్ ట్యాగ్ ను రీఛార్జ్ చేయడంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే…మీరు NAHIహెల్ప్ లైన్ నెంబర్ 1033కి కాల్ చేయవచ్చు. ఫాస్ట్ టాగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఈ హెల్ప్ లైన్ ప్రారంభించబడింది.
కాగా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫాస్టాగ్ లో తక్కువ డబ్బు ఉన్నప్పుడు వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి. ఫాస్టాగ్ రీచార్జ్ చేయలేదంటే..టోల్ ప్లాజా ద్వారా వెళ్లడానికి రెట్టింపు డబ్బును చెల్లించాల్సి రావచ్చు.
Tags
Related News
Paytm FasTag: మీ పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయాలా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సిందే..!
పేటీఎం ఫాస్టాగ్ (Paytm FasTag)ని డీయాక్టివేట్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మూడు పద్ధతులు చాలా సులభం. మీరు ఈ పద్ధతుల్లో దేని ద్వారానైనా మీ Paytm ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేయవచ్చు.