Theft in Raj Bhavan : నిందితుడి అరెస్ట్!
Theft in Raj Bhavan : పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి వచ్చిన ఓ అనుమానాస్పద వ్యక్తి కంప్యూటర్ రూమ్‌లోకి ప్రవేశించి
- By Sudheer Published Date - 09:50 AM, Tue - 20 May 25

తెలంగాణ గవర్నర్ కార్యాలయంగా ఉన్న రాజ్ భవన్(Raj Bhavan)లో చోటుచేసుకున్న చోరీ (Theft ) ఘటన కలకలం రేపుతోంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ రూమ్ నుంచి నాలుగు హార్డ్ డిస్కులు మాయమైనట్లు గుర్తించారు. ఈ హార్డ్ డిస్కుల్లో ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన రిపోర్ట్లు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. అధికార సిబ్బంది ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి వచ్చిన ఓ అనుమానాస్పద వ్యక్తి కంప్యూటర్ రూమ్‌లోకి ప్రవేశించి హార్డ్ డిస్కులు దొంగలించినట్లు గుర్తించారు. అతని ఛాయాచిత్రాలను విశ్లేషించిన అనంతరం, పోలీసులకు క్లారిటీ వచ్చింది.
Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు
చివరికి ఆ వ్యక్తిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించబడిన ఉద్యోగి శ్రీనివాస్(Srinivas)గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. రాజ్ భవన్ వంటి అతి రక్షణ గల ప్రాంతంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన భద్రతా లోపాలపై ప్రత్యేక విచారణ జరుగుతోంది.