Theft: మంచు విష్ణు కార్యాలయంలో చోరీ.!
సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(M.A.A) అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో ఆదివారం చోరీ జరిగింది.
- By Hashtag U Published Date - 08:23 AM, Mon - 28 February 22
సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(M.A.A) అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో ఆదివారం చోరీ జరిగింది. దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి గురైంది. దీంతో మంచు విష్ణు దగ్గర హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేస్తూ మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడు ఉండొచ్చని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.