Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో కాశ్మీర్ లోకి వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీ నగర్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావించారు.
- By Nakshatra Published Date - 07:52 PM, Sun - 19 March 23

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో కాశ్మీర్ లోకి వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీ నగర్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావించారు. జోడో యాత్రలో భాగంగా కొందరు మహిళలు తనని కలిశారని, ఇప్పటికీ వారు లైంగిక దాడులను ఎదుర్కొంటున్నామని తెలిపారు అని చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ. అయితే ఆ బాధిత మహిళలు ఎవరో వారి ప్రాబ్లం తమకు చెప్పాలని వారికీ తాము రక్షణ కల్పిస్తాము అంటున్నారు ఢిల్లీ పోలీసులు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలపై వివరాలను కోరుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీమ్ తుగ్లక్ లేస్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్ళింది. అయితే ఆ అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర సుదీర్ఘ యాత్ర అని, బాధితుల వివరాలు ఇవ్వడానికి తనకు ఇంకా సమయం కావాలని రాహుల్ గాంధీ తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వేధింపుల బారిన పడిన ఢిల్లీ మహిళలు ఎవరైనా ఉన్నారా అనేది తనకు ఎంతో ముఖ్యమని అందులో మైనర్ బాధితులు కూడా ఉండవచ్చని తెలిపారు రాహుల్ గాంధీ.
మార్చి 15న రాహుల్ గాంధీని కలవడం కోసం ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆయన లేరని, 16 వ తేదీ వెళ్ళి ఆదివారం వస్తాము అని నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నోటీసుల ప్రకారం అనగా నేడు ఆదివారం పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. మరి రాహుల్ గాంధీ సదరు బాధిత మహిళలకు సంబంధించిన వివరాలను ఎప్పుడు వెల్లడిస్తారు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

Related News

Karnataka election : ఎన్నికల ప్రచారానికి రాహుల్ సన్నద్ధం
కర్ణాటక ఎన్నికల(Karnataka election) ప్రచారానికి రాహుల్ సిద్ధమయ్యారు.