Drunk and Drive : పోలీసులకే షాక్ ఇచ్చిన మందు బాబులు
కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్‌తో మందు బాబులు ఉడాయించారు
- Author : Sudheer
Date : 28-06-2024 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ మహానగరంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుండడం తో ప్రతి రోజు పోలీసులు రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (hyderabad drunk and drive) చేస్తుంటారు. ఎవరైనా మద్యం సేవించి డ్రైవ్ చేస్తే వారిని అదుపులోకి తీసుకోవడం వంటివి చేస్తుంటారు. దీంతో చాలామంది మందుబాబులు మద్యం సేవించి డ్రైవ్ చేయరు..కానీ కొంతమంది మాత్రం పోలీసులను తప్పించుకొని వెళ్తుంటారు. వీకెండ్ లలో ఎక్కువగా సంఖ్యలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులకే షాక్ ఇచ్చారు మందుబాబులు. బోయిన్‌పల్లిలో గురువారం రాత్రి స్థానిక పోలీసులు పుల్లారెడ్డి ఇంటి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. ఇంతలోనే ఓ కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్‌తో మందు బాబులు ఉడాయించారు. చీకటిగా ఉండడం…కారు స్పీడ్‌గా వెళ్ళడంతో వారిని పట్టుకోలేక పోయారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడం తో వీళ్లు మాములు మందు బాబులు కాదంటూ మాట్లాడుకుంటున్నారు.
Read Also : Redmi Note 14 Pro: మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 14 ప్రో.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?