HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News News
  • ⁄The Doctor Said That The Six Year Old Babus Plea Was Mind Blowing

Doctor : ఆరేళ్ల బాబు చేసిన విజ్ఞప్తి మనసును కదిలించిందన్న డాక్టర్

ఆటపాటలే లోకంగా బతికే ఆరేళ్ల బాబుకు అరుదైన క్యాన్సర్ (Cancer) వచ్చింది. ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పారు.

  • By Maheswara Rao Nadella Published Date - 12:00 PM, Thu - 5 January 23
Doctor : ఆరేళ్ల బాబు చేసిన విజ్ఞప్తి మనసును కదిలించిందన్న డాక్టర్

ఆటపాటలే లోకంగా బతికే ఆరేళ్ల బాబుకు అరుదైన క్యాన్సర్ వచ్చింది. ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పారు. బిడ్డే లోకంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులు దీనిని తట్టుకోలేకపోయారు. అయితే, కొడుకుకు ఈ విషయం తెలియొద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఆ పిల్లాడి నోటా అదే విజ్ఞప్తి. తనకు నిజం తెలుసనే సంగతి తన తల్లిదండ్రులకు చెప్పొద్దని వైద్యులను కోరాడు. ఆరేళ్ల బాబు ఇలా అడిగడంతో షాక్ కు లోనయ్యాడా డాక్టర్ (Doctor) కాసేపటిదాకా తన నోటమాట రాలేదని చెప్పాడు. ఈ సంభాషణను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడా డాక్టర్..

హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ తన ట్విట్టర్ లో ఈ వివరాలు పంచుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆరేళ్ల కుర్రాడు మనూను చెకప్ కోసం పేరెంట్స్ తన దగ్గరకు తీసుకొచ్చారని డాక్టర్ సుధీర్ చెప్పారు. రిపోర్టులు పరిశీలించాక మనూ పేరెంట్స్ తో విడిగా మాట్లాడానని.. తమ కొడుకుకు క్యాన్సర్ విషయం తెలియనివ్వొద్దన్న పేరెంట్స్ విజ్ఞప్తిని మన్నించినట్లు తెలిపారు. ఆ తర్వాత మనూ కూడా తనతో ప్రైవేటుగా మాట్లాడాడని, అప్పుడు మనూ అడిగిన ప్రశ్న తనను షాక్ కు గురిచేసిందని చెప్పారు.

Also Read:  Elephant Traffic Rule : రోడ్డు మీద పెట్టిన బైక్ ని విసిరి పారేసిన ఏనుగు

‘డాక్టర్ (Doctor) నాకు క్యాన్సర్ అని, మరో ఆరు నెలలకంటే ఎక్కువ కాలం బతకననీ తెలుసు. ఐపాడ్ లో చదివి ఈ వ్యాధి గురించి తెలుసుకున్నా. కానీ నాకు నిజం తెలుసనే విషయం మా అమ్మానాన్నలకు చెప్పొద్దు. ప్లీజ్’ అని మనూ కోరాడని డాక్టర్ సుధీర్ చెప్పారు. అయితే, మనూకు ఇచ్చిన మాటను తను నిలబెట్టుకోలేకపోయానని తెలిపారు. వెంటనే మనూ పేరెంట్స్ ను లోపలికి పిలిచి మరోమారు ఒంటరిగా మాట్లాడినట్లు వివరించారు. ఈ విషయం మనూ పేరెంట్స్ కు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ సుధీర్ తెలిపారు.

6-yr old to me: “Doctor, I have grade 4 cancer and will live only for 6 more months, don’t tell my parents about this”
1. It was another busy OPD, when a young couple walked in. They had a request “Manu is waiting outside. He has cancer, but we haven’t disclosed that to him+

— Dr Sudhir Kumar MD DM🇮🇳 (@hyderabaddoctor) January 4, 2023

Telegram Channel

Tags  

  • 6 Years Boy
  • cancer
  • doctor
  • twitter
  • young boy

Related News

Kangana Twitter: ట్విట్టర్ లోకి కంగనా రీ ఎంట్రీ.. ఫస్ట్ అప్ డేట్ ఇదే!

Kangana Twitter: ట్విట్టర్ లోకి కంగనా రీ ఎంట్రీ.. ఫస్ట్ అప్ డేట్ ఇదే!

కంగనా రెండేళ్ల తర్వాత ట్విట్టర్ (Twitter) లోకి అడుగు పెట్టింది. అయితే, ఆమెకు ఇంకా బ్లూ టిక్ ఇవ్వలేదు.

  • Elon Musk: అలాంటి బాధను అనుభవించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

    Elon Musk: అలాంటి బాధను అనుభవించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • Central Govt: ట్విటర్, యూట్యూబ్‌లకు..కేంద్రం సంచలన ఆదేశాలు!

    Central Govt: ట్విటర్, యూట్యూబ్‌లకు..కేంద్రం సంచలన ఆదేశాలు!

  • Twitter User Interface : రూపు మార్చుకుంటున్న ట్విట్టర్..

    Twitter User Interface : రూపు మార్చుకుంటున్న ట్విట్టర్..

  • Twitter Hacked: కాంతార నటుడి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కారణం అదేనట..?

    Twitter Hacked: కాంతార నటుడి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కారణం అదేనట..?

Latest News

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: