Fake Doctor: యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్… బాలుడి మృతి
Fake Doctor: ఓ నకిలీ వైద్యుడు చేసిన నిర్వాకానికి 15 ఏళ్ల బాలుడు కృష్ణ కుమార్ మృత్యువాత పడ్డాడు. సరైన అర్హత లేకుండానే.. డాక్టర్ అంటూ.. అజిత్ కుమార్ పూరి అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఓ బాలుడికి ఆపరేషన్ చేయడం ప్రా
- By Kavya Krishna Published Date - 12:49 PM, Sun - 8 September 24

Boy Dies After Undergoing Surgery Based on YouTube Videos: ఓ నకిలీ వైద్యుడు చేసిన నిర్వాకానికి 15 ఏళ్ల బాలుడు కృష్ణ కుమార్ మృత్యువాత పడ్డాడు. సరైన అర్హత లేకుండానే.. డాక్టర్ అంటూ.. అజిత్ కుమార్ పూరి అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఓ బాలుడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు.. సర్జరీ ఫెయిల్ కావడంతో.. పరిస్థితి విషమించిందంటూ.. బాలుడిని రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఆసుపత్రికి తరలించడానికి ‘డాక్టర్’ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాడు. మార్గమధ్యంలో బాలుడు మరణించడంతో ‘డాక్టర్’తో పాటు సిబ్బంది పరారయ్యారు. దీంతో మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also :Drinking Water In Morning: ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
కృష్ణ కుమార్ చాలాసార్లు వాంతులు చేసుకోవడంతో శరన్‌లోని గణపతి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. “మేము అతనిని అడ్మిట్ చేసాము, వెంటనే వాంతులు ఆగిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి అతనికి ఆపరేషన్ చేయవలసి ఉందని చెప్పారు. అతను యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆపరేషన్ చేసాడు. దీంతో నా కొడుకు మరణించాడు,” అని బాలుడి తండ్రి చందన్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘డాక్టర్’కి సరైన విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు. “అతను స్వీయ-శైలి, నకిలీ అని మేము విస్తున్నాము” అని వారు చెప్పారు.
వాంతులు ఆగిపోవడంతో బాలుడికి ఆరోగ్యం మెరుగైందని యువకుడి తాత తెలిపారు. “కానీ డాక్టర్ ఒక పని మీద తండ్రిని పంపించి, కుటుంబ అనుమతి లేకుండా అబ్బాయికి ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు. అబ్బాయి నొప్పితో ఉన్నాడు, ఎందుకు నొప్పి అని డాక్టర్ని అడగగా, అతను మాపై విరుచుకుపడ్డాడు, మీరేమైనా వైద్యులా అంటూ మాపై మండిపడ్డాడు. సాయంత్రానికి బాలుడు బతికాడు (సీపీఆర్‌తో).. ఆ తరువాత మార్గమధ్యంలో బాలుడు మరణించడంతో.. మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయాడు’’ అని కృష్ణకుమార్ తాతయ్య తెలిపారు.
విద్యార్హతలు తెలియకపోతే అజిత్ కుమార్ పూరి వద్దకు ఎందుకు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. వాంతులు ఆగాయనుకున్నాం.. మా అంగీకారం లేకుండానే ఆపరేషన్ చేయించాడని వారు వాపోయారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. ఈ వైద్యుడు, ఇతర సిబ్బంది ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Read Also :Driving License: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే తప్పులు ఇవే..!