HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Thailand Businessman Drinks Crocodile Blood Alcohol Health

Thailand: దారుణం.. యవ్వనం కోసం ముసలి రక్తంలో మద్యం కలుపుకొని తాగేస్తున్నాడుగా?

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించడం కోసం ఎన్నో రకాల పాట్లు పడుతూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడంతో పాటు వ్యాయామాలు యోగా

  • Author : Anshu Date : 18-06-2023 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thailand
Thailand

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించడం కోసం ఎన్నో రకాల పాట్లు పడుతూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడంతో పాటు వ్యాయామాలు యోగాలు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఆహార పదార్థాల విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అని చెప్పవచ్చు. యవ్వనంగా కనిపించడం కోసం ఏకంగా రక్తంలో మందును కలుపుకొని తాగుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు. ఆ వ్యక్తికి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది.

ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. థాయ్‌లాండ్‌కు చెందిన రోజాకోర్న్‌ నైనోన్‌ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని పొందడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్‌ ఉంది. ఇతను వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసింది.

దాంతో అప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే. మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది. పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో లావోఖానో అనే థాయ్‌ మద్యాన్ని కలిపి కాక్‌టెయిల్‌ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను అని కోర్న్‌ తెలిపాడు. ఈ మధ్యనే ఈ కాక్‌టెయిల్‌ను ఒక పెగ్‌ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • crocodile blood
  • man drink blood
  • thailand
  • Thailand man

Related News

Quentin Griffiths

17వ అంతస్తు పై నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి

Quentin Griffiths  ఫ్యాషన్ దిగ్గజం ఏఎస్ఓఎస్ (ASOS) సహ వ్యవస్థాపకుడు క్వెంటిన్ గ్రిఫిత్స్ థాయ్‌లాండ్‌లో ఓ అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. పట్టాయాలోని అపార్ట్ మెంట్ నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి మృతి చెందారు. పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు వచ్చి చూసేసరికి ఆయన నేలపై విగతజీవుడిలా కనిపించారు. ఆయన మ

    Latest News

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd