Dehradun : కేదార్ నాథ్ కొండలపై భయంకరమైన హిమపాతం…2013 విపత్తు తప్పదా..?
2013లో జరిగిన ఘోరమైన ప్రకృతి వైపరీత్యం గురించి తెలిసిందే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో ఎలాంటి విలయం స్రుష్టించిందో ఆ ద్రుశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు తిరుగుతున్నాయి.
- Author : hashtagu
Date : 01-10-2022 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
2013లో జరిగిన ఘోరమైన ప్రకృతి వైపరీత్యం గురించి తెలిసిందే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో ఎలాంటి విలయం స్రుష్టించిందో ఆ ద్రుశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు తిరుగుతున్నాయి. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకు వరకు కొంతమంది జాడ తెలియలేదు. భారీగా ఆస్తిప్రాణ నష్టం. ఈ విపత్తు దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా షాక్ తినేలా చేసింది. అయితే ఇప్పుడు మరోసారి కేదార్‌నాథ్ ధామ్ వెనుక ఉన్న పర్వతాలపై మరోసారి భయంకరమైన హిమపాతం సంభవించింది. ఇది చూసిన వారంతా 2013 సంవత్సరం నాటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. కేదార్ నాథ్ లో ఉన్న కొంతమంది పర్యాటకులు ఈ హిమపాతాన్ని వీడియో తీశారు.
#WATCH | Uttarakhand: An avalanche occurred this morning in the Himalayan region but no damage was sustained to the Kedarnath temple: Shri Badrinath-Kedarnath Temple Committee President, Ajendra Ajay pic.twitter.com/fyi2WofTqZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2022
ఈ కుంభవృష్టిని ఎవరు చూసినా 2013లో జరిగిన విపత్తు దృశ్యాలు కళ్లముందు మెదులుతాయని ఓ పర్యాటకుడు తెలిపాడు.. అదే సమయంలో, ధామ్‌లో ఉన్న కొంతమంది హిమపాతాన్ని వీడియో కూడా తీశారు. అది ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం కూడా, కేదార్‌నాథ్ ధామ్‌లోని ఎత్తైన శిఖరాలపై హిమపాతం సంభవించింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటననే జరగరడంతో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇలా వరసగా హిమపాతం సంభవిస్తుండటంతో మళ్లీ 2013 నాటి విపత్తు తప్పదేమోనని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.