TS SSC Exams: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం
- Author : HashtagU Desk
Date : 11-02-2022 - 12:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో గురువారం టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల విడుదలైన నేపధ్యంలో, తెలంగాణలో కూడా టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలకానుంది. సమాచారం. ఈ క్రమంలో మే 9వ తేదీ నుంచి 12వ తేదీల టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుందని, సమాచారం.
ఈ నేధ్‌యంలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఒకటీ రెండు రోజుల్లో విద్యాశాఖ రేపో వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. ఇకపోతే తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ నుంచే అధికారులు కసరత్తు చేస్తారు. అయితే కరోనా మూలంగా పరీక్షలు లేకుండానే గతేడాది విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదోతరగతి పరీక్షలు ఉంటాయా, లేదా అనే కన్ఫ్యూజన్‌లో విద్యాశాఖ ఉంది.
అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఇక ఇప్పటికే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి.