Dengue Death: భయపెడుతున్న డెంగ్యూ, ఏపీలో పదో తరగతి విద్యార్థిని మృతి
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి.
- By Balu J Published Date - 01:03 PM, Tue - 31 October 23
Dengue Death: తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో లెక్కకు మించి కేసులు నమోదవుతుండగా, పొరుగు రాష్ట్రం ఏపీలోనూ డెంగ్యూ డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా కుమవరం మండలం పాండ్రాజు పల్లి గ్రామానికి చెందిన ముచ్చిక మాధవి (14) డెంగ్యూ, జాండీస్‌తో మృతి చెందింది. ఆమె కోతులగుట్టలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
దసరా సెలవుల అనంతరం ఆమె తల్లి వెంకటలక్ష్మి అక్టోబరు 26న మాధవిని పాఠశాలకు తీసుకెళ్లగా, మాధవి అస్వస్థతకు గురికావడంతో పాఠశాల అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూనవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ఆదివారం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు వెంకటలక్ష్మి తెలిపారు. ఆదివారం రాత్రి తన కూతురు చనిపోయిందని, డెంగ్యూ, మలేరియా, జాండీస్‌తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Varun-Lavanya: ఇటలీలో వరుణ్-లావణ్యల పెళ్లిసందడి, మెగా ఫ్యామిలీ పిక్స్ వైరల్