Collector: వివాదంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ!
కలెక్టర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయిపోయాయి.
- By Balu J Published Date - 11:48 AM, Thu - 14 April 22
కలెక్టర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయిపోయాయి. ఈ మేరకు నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్.. కలెక్టర్ టెన్నిస్ హెల్పర్లుగా 21 మంది వీఆర్ఏల పేర్లను ప్రస్తావిస్తూ ఓ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలోని 21 మంది వీఆర్ఏలలో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళల్లో కలెక్టర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వద్ద బంతులు అందించే విధులకు హాజరు కావాలట. ఈ జాబితా మీడియాకు చిక్కడంతో ఒక్కసారిగా కలెక్టర్‌పై వివాదం రేగింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కలెక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు మండిపడుతున్నాయి.
I am not aware of the order given by the tehsildar, i will review the order and do an enquiry if it has created problem to VRA's. I will take action after the enquriy : Musharaf Ali to TV9 https://t.co/9NQQaauVwQ
— Agasthya Kantu (@kantuagasthya) April 13, 2022
Related News
Razakar Controversy: రజాకార్ సినిమా నిర్మాతకు కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రత
రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డికి హాని కలిగించేలా ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిచింది కేంద్ర హోంశాఖ.