Gaddam Meghana: అరుదైన గౌరవం.. న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి..!
18 ఏళ్లకే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌరవం దక్కించుకున్నారు తెలుగు తేజం మేఘన గడ్డం. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన
- By Balu J Published Date - 02:13 PM, Tue - 18 January 22

18 ఏళ్లకే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌరవం దక్కించుకున్నారు తెలుగు తేజం మేఘన గడ్డం. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైయ్యారు. ఆ దేశంలో నామినేటెడ్ ఏంపీ పదవుల భర్తీ జరిగింది. దీనిలో భాగంగా సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా మేఘన ఎన్నికైయ్యారు. వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవీకి ఎంపికయ్యారు.
మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్ లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001 లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం భార్య ఉషాతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన రవి కుమార్ అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది. చిన్న నాటి నుంచే ఛారిటీ కార్యక్రమాలు చేస్తూ,ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు కూడు,గుడ్డ అందించి ఎంతో మందిని ఆమె ఆదుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు న్యూజిలాండ్ దేశం ఎంపీగా నామినేట్ చేసి గౌరవించింది.