Telangana youth: బ్రెయిన్ స్ట్రోక్‌తో అమెరికాలో తెలంగాణ యువకుడు హఠాన్మరణం
- Author : Balu J
Date : 26-02-2024 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana youth: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న తెలంగాణ యువకుడు రుత్విక్ రాజన్ హఠాన్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్ద కుమారుడు బండ రుత్విక్రజన్ (30) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అతను ఇటీవల టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి తన MS పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించి స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం రాత్రి మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కాగా అమెరికాలో ఘోర ప్రమాదంలో భారత్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ (Indian Journalist) ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన ఫాజిల్ ఖాన్ (27) గతంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో కాపీ ఎడిటర్‌గా పనిచేశాడు. అయితే జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సును పూర్తి చేశాడు. అనంతరం అతడు అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం ఫాజిల్ నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భవనంలో చిక్కుకుపోయిన ఫాజిల్ (Fazil Khan) ప్రాణాలు కోల్పోయాడు.