HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana State Police Welfare Society For Police Welfare

Telangana Police: పోలీస్ సంక్షేమానికై ‘తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ ఏర్పాటు – ‘డీజీపీ మహేందర్ రెడ్డి’

దాదాపు ఒక లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమానికై మరో ముందగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్ శాఖ...

  • Author : Hashtag U Date : 25-03-2022 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ts Police
Ts Police

దాదాపు ఒక లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమానికై మరో ముందగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్ శాఖ… ప్రతీ అధికారి, సిబ్బంది తమ పదవీ విరమణలోగా కనీసం ఒక ఇంటిని లేదా ఫ్లాట్ ను కలిగి ఉండేలా తగు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ‘తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ నిర్వహణతీరు, దీని ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ. లు, యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడిషనల్ డీజీ లు ఉమేష్ షరాఫ్, జితేందర్ లు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో… డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర పోలీస్ అధికారుల సంక్షేమానికై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటుకు అనుమతించడమే కాకుండా, ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా సహకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య భద్రతా మాదిరిగానే పోలీసులకు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం కేసీఆర్ ను కోరగా, ఇందుకై ప్రత్యేకంగా మూల ధనాన్ని పెంపొందించుకునేందుకై పోలీస్ శాఖ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ పంపులు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికై అనుమతిచ్చారని డీజీపీ తెలిపారు.
దీనిలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని… ఈ సొసైటీ కి స్వచ్ఛందంగా విరాళాలు అందించేవారికి, వివిధ కార్యక్రమాల ద్వారా పొందే ఆదాయానికి 80 జి, 12 ఏ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభించిందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ సొసైటీ కి సమకూరే నిధులనుండి పోలీసు అధికారులకు ఇల్లు లేదా ఫ్లాట్ ల కొనుగోలుకు నామమాత్రపు వడ్డీపై రుణాలను అందించనున్నట్టు వివరించారు.

తెలంగాణలో సి.సి. టీవీ ల నిర్వహణకు ప్రత్యేక విభాగం:
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల సీసీ టీవీ ల నిర్వహణకై ప్రత్యేకంగా ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సీసీ టీవీ లను ఏర్పాటు చేసినప్పటికీ, వాటి నిర్వహణకై ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. దీనిని అధిగమించడానికి అడిషనల్ డీజీ జితేందర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ అనే సంస్థను ఏర్పాటు చేసి, దీనిద్వారా సీసీటీవీ ప్రాజెక్ట్ నిర్వహణను నిరాటంకంగా కొనసాగిస్తామని వివరించారు. సీసీటీవీ ల నిర్వహణకై ప్రత్యేకంగా కామన్ సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సొసైటీ కి సి.ఎస్.ఆర్ కింద గానీ, స్వచ్ఛందంగా గానీ అందచేసే నిధులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.

కోవిడ్ మృతుల పోలీస్ కుటుంబాల పిల్లలకు స్కాలర్-షిప్ లను అందించిన డీజీపీ:
కోవిడ్-19 తో మరణించిన పోలీసు కుటుంబాల పిల్లలకు డీజీపీ మహేందర్ రెడ్డి స్కాలర్షిప్ లను అందించారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేశారు. సి.ఎస్.ఆర్ పధకంలో భాగంగా హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంకు, కరోనా మృతుల పోలీసు కుటుంబాల పిల్లలకు రూ.15 ,000 నుండి 75 ,000 వరకు అందించింది. ఈ ఆర్థిక సహాయం అందచేసిన కార్యక్రమంలో అడిషనల్ డీజీలు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంకు అధికారులు తరుణ్ చౌదరి, బద్రి విశాల్, జోస్ స్టీఫెన్ లు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dgp mahendra reddy
  • telangana police welfare
  • Telangana State Police Welfare Society

Related News

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd