TS Tenth Results : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన బాలికలు
- By Prasad Published Date - 03:38 PM, Thu - 30 June 22

హైదరాబాద్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షాఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,03,579 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో బాలుర కంటే బాలికలు మరోసారి సత్తా చాటారు. పరీక్షకు హాజరైన 2,48,146 మంది బాలికల్లో 92.45 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, 2,55,433 మంది బాలురు పరీక్షలు రాయగా, 87.61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుండి 10 వరకు నిర్వహించినున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.. విద్యార్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి చివరి తేది జూలై 18గా నిర్ణయించారు.