Musi River: మూసీ నది ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- By Balu J Published Date - 10:12 AM, Sun - 10 March 24

Musi River: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మూసీ నది ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలు సీవేజీ ప్లాంటులను ఏర్పాటు చేస్తోంది. నగరం నలువైపులా సుడిగాలిలా పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉప్పల్ నల్లచెరువు సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే ముందడుగు పడిందని, నగర సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. నగర అభివృద్ధికి కీలకమైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారి విషయంలో ఎవరినీ ఉపేక్షించలేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.