DSPs Transfers: హైదరాబాద్ పరిధిలో 26 మంది డీఎస్పీలు బదిలీ
హైదరాబాద్ పరిధిలో 26 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. వారికీ కొత్తగా పోస్టింగులు కేటాయిస్తూ తెలంగాణ
- Author : Praveen Aluthuru
Date : 13-07-2023 - 6:20 IST
Published By : Hashtagu Telugu Desk
DSPs Transfers: హైదరాబాద్ పరిధిలో 26 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. వారికీ కొత్తగా పోస్టింగులు కేటాయిస్తూ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ నగర పోలీసు పరిధిలోని జూబ్లీహిల్స్, చిలకలగూడ డివిజన్లకు కొత్త అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)లను కేటాయించారు. హరిప్రసాద్ కట్టా జూబ్లీహిల్స్‌కు, వీ జైపాల్‌రెడ్డిని చిలకలగూడ పీఎస్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సుల్తాన్ బజార్ ఏసీపీగా ఏసీ బాలనాగిరెడ్డి, షాద్ నగర్ ఏసీపీగా ఎన్ సీహెచ్ రంగస్వామి, మాదాపూర్ ఏసీపీగా పీ శ్రీనివాస్, శంషాబాద్ ఏసీపీగా ఎన్ రాంచందర్ రావులను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అదనంగా, శంషాబాద్, సైబరాబాద్ ఏసీపీగా రాంచందర్ రావు, హుజూరాబాద్ ఏసీపీగా జీవన్ రెడ్డి ఎల్ లను కేటాయించారు.
Read More: MLC Kavitha Tour: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత